Psalms 1

ప్రథమ పరిచ్ఛేదము

1దుర్మార్గుల సలహా ప్రకారం నడుచుకోనివాడు, పాపాత్ముల దారిలో నిలిచి ఉండనివాడు, అల్లరిచిల్లర మూకలతో కూర్చోని వాడు ధన్యుడు.
2 అతని ఆనందం యెహోవా ధర్మశాస్త్రంలో ఉంటుంది. అతడు రేయింబవళ్ళు దాన్ని ధ్యానం చేస్తూ ఉంటాడు.

3

అతడు నీటికాలువల ఒడ్డున నాటుకుని, ఆకు వాడకుండా తగిన కాలంలో ఫలించే చెట్టులాగా ఉంటాడు. అతడు ఏది చేసినా వర్ధిల్లుతాడు.


4

దుర్మార్గులు అలా ఉండరు. వాళ్ళు గాలికి ఎగిరిపోయే ఊకలాగా ఉంటారు.

5 కాబట్టి తీర్పులో దుర్మార్గులు నిలవరు. అలానే నీతిమంతుల సభలో పాపులు నిలబడరు.

6

నీతిపరుల మార్గం యెహోవాకు ఆమోదం. దుర్మార్గుల మార్గం నాశనం.

Copyright information for TelULB